Posts

Prayatnam

ఎన్నో ఒడిదుడుకుల సంద్రంలో , తీరం  చేరాలన్న ఒక 'అల' ప్రయాణం ఇది.. తన భావాల్ని ఒక గుండెకు చేర్చాలన్న ఒక ప్రేమికుని ఆరాటం ఇది.. ప్రేమలో గెలవలేకపోయినా  ప్రేమికుడిగా గెలిచానంటున్న ఒక ప్రేమికుడి సహనం...ప్రేమకధ...కొన్ని వాక్యాల్లో.

Ankitham

నా మౌనానికి మాటలు నేర్పిన నా చెలి చిరునవ్వు తన ముఖం పై ఎల్లప్పుడు ఉండాలని ఆశిస్తూ...ఈ ప్రేమగీతం అంకితం..

Parichayam

నీతో పరిచయం, నాలో నింపెను ఆనందం, తరగని సంతోషం, నాకు కావాలి చిరకాలం..

Neevu

అనుక్షణం నా ఊపిరి నీవు.. ప్రతిక్షణం నా యదలో నీవు.. ప్రతి రేయి నా స్వప్నం నీవు.. జీవితంలో గమ్యం నీవు.. కడవరకు నా జీవం నీవు.

Aasha

నా కన్నులకి ఆశ నిన్ను చూడాలని.. నా చెవులకి ఆశ నీ మాట వినాలని.. నా పెదవులకి ఆశ నీతో మాట్లాడాలని.. నా కరములకి ఆశ నిన్ను తాకాలని.. నా పాదములకి ఆశ నీతో నడవాలని.. నా మనసుకి ఆశ నీతో స్నేహం చెయ్యాలని.. నా హృదయానికి ఆశ నీలో స్థానం కావాలని.. నాకు ఆశ నువ్వెల్లప్పుడు నవ్వుతూ ఉండాలని.

Aanandam

ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల.. ఎటు చుసినా నువ్వే.. నా కనుపాపలలో నీ రూపే.. నా ఎద నిండా నీ ఊహలే.. నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే.. ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా..