Thursday, January 27, 2011

Prayatnam

ఎన్నో ఒడిదుడుకుల సంద్రంలో , తీరం  చేరాలన్న ఒక 'అల' ప్రయాణం ఇది..
తన భావాల్ని ఒక గుండెకు చేర్చాలన్న ఒక ప్రేమికుని ఆరాటం ఇది..
ప్రేమలో గెలవలేకపోయినా  ప్రేమికుడిగా గెలిచానంటున్న ఒక ప్రేమికుడి సహనం...ప్రేమకధ...కొన్ని వాక్యాల్లో.

Ankitham


నా మౌనానికి మాటలు నేర్పిన నా చెలి చిరునవ్వు తన ముఖం పై ఎల్లప్పుడు ఉండాలని ఆశిస్తూ...ఈ ప్రేమగీతం అంకితం..

Parichayam


నీతో పరిచయం,
నాలో నింపెను ఆనందం,
తరగని సంతోషం,
నాకు కావాలి చిరకాలం..

Neevu


అనుక్షణం నా ఊపిరి నీవు..
ప్రతిక్షణం నా యదలో నీవు..
ప్రతి రేయి నా స్వప్నం నీవు..
జీవితంలో గమ్యం నీవు..
కడవరకు నా జీవం నీవు.

Aasha


నా కన్నులకి ఆశ నిన్ను చూడాలని..
నా చెవులకి ఆశ నీ మాట వినాలని..
నా పెదవులకి ఆశ నీతో మాట్లాడాలని..
నా కరములకి ఆశ నిన్ను తాకాలని..
నా పాదములకి ఆశ నీతో నడవాలని..
నా మనసుకి ఆశ నీతో స్నేహం చెయ్యాలని..
నా హృదయానికి ఆశ నీలో స్థానం కావాలని..
నాకు ఆశ నువ్వెల్లప్పుడు నవ్వుతూ ఉండాలని.

Aanandam


ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల..
ఎటు చుసినా నువ్వే..
నా కనుపాపలలో నీ రూపే..
నా ఎద నిండా నీ ఊహలే..
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే..
ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా..

Kshanam


జననం ఒక క్షణం..
మరణం ఒక క్షణం..
మధ్యన జీవితం ఒక సంద్రం..
ఆ జీవన సంద్రంలో నీతో ఒక క్షణమైన  చాలంటా..

Chustunnava

నిన్న మొన్నటిదాకా నాతోనే ఉన్న నా ఆనందం నను ఒంటరిని చేసింది..
మనసులేనిచోట తాను ఉండలేను అంటుంది..
నను విడిచి నీకోసం పరుగులు తీస్తుంది..
మళ్లీ వస్తే అది నీతోటే అంటుంది..
ప్రియతమా చూస్తున్నావా ఈ నిజ ప్రేమికుడి సహనం , నాకే స్థానం లేని నా మనసుని , నీకై కన్నీరు కార్చే నా కనులని, ప్రతి క్షణం నీకై ఆలోచించే నా హృదయముని...నిజమైన ప్రేమనినినిని.

Aakanksha


నా మది'నది' అనే స్వచ్చమైన నీటిలో అందమైన మీనం నీవు..
నీ చిరునవ్వుకి కారణమని అడిగితే నువ్వంటున్నావ్  'నది'యై పారే కల్మషం లేని నా కన్నీరని..
నీ కన్నులు చెప్పే భావాలు,మనసు దాచే మాటై రావాలని , భాధై కారే నా కన్నీరు, ప్రేమ అనే ఆనందభాష్పాలుగా మారాలని నా ఆకాంక్ష..

shaswatham

అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయి శోకంలో  ఉన్న నా హృదయానికి తోడై ఒదార్పునిచ్చావ్..
నీవు లేని నా జీవితం , అలలు తాకని తీరం  వంటిది..
జీవం  లేని దేహం వంటిది..అంటోంది నా మది..
నేస్తం ఇది నిజం..
నా కవితకు భావం నీవు..
నా ప్రేమకు రూపం నీవు..
నీపై నా ప్రేమ శాశ్వతం.

nireekshana

నిండు వెన్నల వెలుగులో,
వీచే పిల్ల గాలుల సవ్వడిలో,
చిరు నవ్వులు చిందిస్తున్న నిన్ను చూడాలని,
నీ నవ్వుకి వేచిన నా కన్నుల నిరీక్షణ నిజమవ్వాలని...

istam


నువ్వంటే చాల ఇష్టం..
ఎందుకు అని అడిగితే నా మది చెప్పే విషయం నా మాటకు అందడం లేదు నేస్తం..
నా అనే నేను కన్నా నాలో ఉన్న నువ్వంటే ఇష్టం..
నా అనుకునే నువ్వు నాలో సగమైతే ఇంకా ఇష్టం...

oopiri


ప్రతి రోజు తొలి,చివరి ఆలోచనలు నీవు...
నీ దృష్టిలో అప్పుడప్పుడు పలకరించే పైరుగాలి వంటివాడిని నేను...
కాని నాకు చివ్వరి క్షణం వరకు తోడుండే శ్వాస అనే ఊపిరివి నీవు.

kalavaram

ఈ క్షణం నాలో ఏదో కలవరం,
నిన్ను గెలిచే ఆ క్షణం నాకు ఇచ్చేనా  కాలం?
ప్రతిక్షణం నేను కోరుతున్న ఆ వరం నాకు ఇచ్చేనా దైవం?
నీ కోసం నేను కనే ప్రతి స్వప్నం నిజమయ్యేనా నేస్తం???.

Monday, January 17, 2011

Be happy

I was totally unread when you left out of me..
after the days passed away in memorising you,now i can read everyone..
my heart became a precise instrument which works every second for you..
thank you for your help in exposing inner side of my.....
be happy forever...