ఎన్నో ఒడిదుడుకుల సంద్రంలో , తీరం చేరాలన్న ఒక 'అల' ప్రయాణం ఇది.. తన భావాల్ని ఒక గుండెకు చేర్చాలన్న ఒక ప్రేమికుని ఆరాటం ఇది.. ప్రేమలో గెలవలేకపోయినా ప్రేమికుడిగా గెలిచానంటున్న ఒక ప్రేమికుడి సహనం...ప్రేమకధ...కొన్ని వాక్యాల్లో.
అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయి శోకంలో ఉన్న నా హృదయానికి తోడై ఒదార్పునిచ్చావ్.. నీవు లేని నా జీవితం , అలలు తాకని తీరం వంటిది.. జీవం లేని దేహం వంటిది..అంటోంది నా మది.. నేస్తం ఇది నిజం.. నా కవితకు భావం నీవు.. నా ప్రేమకు రూపం నీవు.. నీపై నా ప్రేమ శాశ్వతం.
ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల.. ఎటు చుసినా నువ్వే.. నా కనుపాపలలో నీ రూపే.. నా ఎద నిండా నీ ఊహలే.. నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే.. ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా..
amito nivu kshanam kadu jeevitantam janmajanmalu tanatone vndli ra
ReplyDelete